క్రీడా ప్రతిభకు వేదిక.. సెప్టెంబర్‌ 9న ఎంపికలు.

క్రీడా ప్రతిభకు వేదిక.. సెప్టెంబర్‌ 9న ఎంపికలు.

ఎల్కతుర్తి, ఆగస్టు 29 (తెలంగాణ ముచ్చట్లు): 

ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఎంఈఓ చదువుల సత్యనారాయణ ఆదేశాల మేరకు మండల ఎస్‌జీఎఫ్‌ సమావేశం కార్మెల్‌ కాన్వెంట్‌ హైస్కూల్‌లో నిర్వహించారు. మండల సెక్రటరీ ఎం. ధనలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండల స్థాయిలో నిర్వహించే అండర్‌-14, అండర్‌-17 బాలబాలికల కబడ్డీ, కోకో క్రీడలకు క్రీడాకారుల ఎంపికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 2026 సెప్టెంబర్‌ 9న మండల స్థాయి క్రీడా ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ ఎం. ధనలక్ష్మి మాట్లాడుతూ క్రీడాకారులు సెప్టెంబర్‌ 9న ఉదయం 9 గంటలలోపు కార్మెల్‌ కాన్వెంట్‌ హైస్కూల్‌లో రిపోర్ట్‌ చేయాలని సూచించారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తప్పనిసరిగా ఆధార్‌ నంబర్‌,   పెన్ నెంబర్             వెంట తీసుకురావాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పీడీలు, పీఈటీలు బి. సుధాకర్‌, జి. శ్రీకాంత్‌, ఆర్. ఉదయ్‌, కె. తిరుపతి, సిహెచ్. పూర్ణిమ, టి. రాములు, జి. ప్రేమ ప్రసాద్‌రావు, ఎం. ఉషారాణి, ప్రభావతి, బి. స్వరూప, బి. కిరణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

టీసీల కోసం విద్యార్థుల ధర్నా. టీసీల కోసం విద్యార్థుల ధర్నా.
జమ్మికుంట టౌన్ ఆగస్టు 29 (తెలంగాణ ముచ్చట్లు): పట్టణంలోని విస్డం కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు టీసీలు (ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్లు) ఇవ్వకుండా కళాశాల యాజమాన్యం తిప్పించుకుంటోందని...
పెద్దమందడి జిపిఓ కాశన్న అకాల మృతి.
గ్రామాల బాట పట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్.
టీసీల కోసం విద్యార్థుల ధర్నా.
స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన మిత్రబృందం.
సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా ఓరియంటేషన్ ప్రోగ్రాం.
డ్రైనేజీలోకి దూసుకెళ్లిన బైక్.. వ్యక్తికి తీవ్ర గాయాలు.