ఉద్యోగుల డిమాండ్లను అసెంబ్లీలో ప్రస్తావిస్తా.
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి.
వనపర్తి,ఆగస్టు27(తెలంగాణ ముచ్చట్లు):
ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి హామీ ఇచ్చారు. వనపర్తి జిల్లా కలెక్టరేట్ ఎదుట టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాధర్నా శిబిరాన్ని ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా టీజీఈ జేఏసీ నాయకులు ఉద్యోగుల ప్రధాన సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్‌లో ఉన్న కరువు భత్యాల (డీఏ) విడుదల, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెండింగ్ ఆర్థిక ప్రయోజనాల చెల్లింపు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు, ఉద్యోగుల ఆరోగ్య కార్డుల్లోని లోపాలను సవరించి ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని కోరారు.ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి తెలిపారు. ఉద్యోగుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి హామీ ఇవ్వడంపై టీజీఈ జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.


Comments