పామిరెడ్డిపల్లిలో వికసిత్ ప్రణాళికకు శ్రీకారం.
పెద్దమందడి,ఆగస్టు29(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికలో భాగంగా తొలి గ్రామసభను సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం అధ్యక్షతన నిర్వహించారు. గ్రామంలో అవసరమైన మౌలిక వసతులు, రైతులకు ఉపయోగపడే అభివృద్ధి పనులపై చర్చించారు.జలసిరి కార్యక్రమంలో భాగంగా బోరుబావుల పునరుద్ధరణ గుంతలు, నీటి నిల్వ కుంటలు, పొలాల్లో నీటి కుంటలు, ఇంకుడు గుంతలు, ఇంటింటా ఇంకుడు గుంతలు, పండ్ల తోటలు, పశువుల కొట్టాలు, గొర్రెల కొట్టాలు, నాటుకోళ్ల పెంపకం వంటి పనులకు అవకాశం ఉన్నట్లు రైతులకు వివరించారు. ఈ పనుల కోసం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.గ్రామంలో అవసరమైన పనులను గుర్తించి గ్రామపంచాయతీ ఆమోదంతో చేపట్టాలని సూచించారు. వచ్చే నెల 8వ తేదీ వరకు రెండో గ్రామసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. అప్పటిలోగా గ్రామ ప్రజలు, రైతులు తమకు అవసరమైన పనులకు దరఖాస్తులు సమర్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల కార్యక్రమ అధికారి సురేష్, సాంకేతిక సహాయకుడు సురేష్, ఉపసర్పంచ్ రాములమ్మ, వార్డు సభ్యులు నరేష్, పద్మ, మాజీ ఎంపీటీసీ ఇందిరా లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ తిక్కన్న, పంచాయతీ కార్యదర్శి స్రవంతి, క్షేత్ర సహాయకుడు ఆనంద్‌తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


Comments