పెద్దమందడి ప్రజావాణికి 8 దరఖాస్తులు.
Views: 0
On
పెద్దమందడి,ఆగస్టు31(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 8 దరఖాస్తులు వచ్చినట్లు పెద్దమందడి ఎంపీడీవో పరిణత, తహసిల్దార్ మల్లికార్జున్ తెలిపారు. మండలంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి దరఖాస్తులు సమర్పించారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సమస్యలను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ మల్లికార్జున్, ఎంపీడీవో పరిణత, ఎస్సై జలంధర్ రెడ్డి, మండల విద్యాధికారి మంజులత, ఏపిఎం సకుర్ నాయక్, విద్యుత్ శాఖ అధికారి, వైద్య సిబ్బంది, వివిధ శాఖలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
31 Aug 2026 20:45:20
ఎమ్మార్పీఎస్ గ్రామ ఉపాధ్యక్షులు యెల్తూరి రాజేష్
ఎల్కతుర్తి ఆగస్టు 31 (తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తి మండలంలోని గోపాల్‌పూర్ గ్రామంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పీ గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు....


Comments