వెల్టూర్ శివాలయానికి హెచ్‌పీ మోటార్ విరాళం.
మాధవరెడ్డి–శాంతమ్మ దంపతుల కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి సేవాభావం.
Views: 0
On
పెద్దమందడి,ఆగస్టు31(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలోని శ్రీ సిద్ధి రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ సంపు కోసం సీఆర్ఐ 1 హెచ్‌పీ మోటార్‌ను కీర్తిశేషులు మాధవరెడ్డి, శాంతమ్మ దంపతుల కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు విరాళంగా అందజేశారు.ఆలయ అవసరాల కోసం మోటార్‌ను విరాళంగా అందించిన శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు ఎం. శివకుమార్ స్వామి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల కోసం దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని అన్నారు.శ్రీ సిద్ధి రామలింగేశ్వర స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని, వారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అర్చకులు శివకుమార్ స్వామి ఆకాంక్షించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
31 Aug 2026 20:45:20
ఎమ్మార్పీఎస్ గ్రామ ఉపాధ్యక్షులు యెల్తూరి రాజేష్
ఎల్కతుర్తి ఆగస్టు 31 (తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తి మండలంలోని గోపాల్‌పూర్ గ్రామంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పీ గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు....


Comments