సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిధి.

సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిధి.

పేదల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా

-- డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి

వనపర్తి,ఆగస్టు31(తెలంగాణ ముచ్చట్లు):

పేదల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తోందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తిలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వం మంజూరు చేసిన రూ.45,31,100 విలువైన 150 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ 1 నాటికి వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకోనుందని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నామని, ఆరోగ్యశ్రీ వర్తించని వారికి చికిత్స అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.వనపర్తి నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా మానవతా దృక్పథంతో అర్హులైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేద కుటుంబానికి చేరేలా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని కోరారు.చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నందిమల్ల యాదయ్య, రాజేంద్రప్రసాద్ యాదవ్, అక్తర్, దేవన్న యాదవ్, చంద్రశేఖర్, నాగార్జున, ఆవుల చంద్రశేఖర్, గట్టు రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గోపాల్‌పూర్‌లో ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్‌పీ గ్రామ కమిటీలు. గోపాల్‌పూర్‌లో ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్‌పీ గ్రామ కమిటీలు.
ఎమ్మార్పీఎస్ గ్రామ ఉపాధ్యక్షులు యెల్తూరి రాజేష్ ఎల్కతుర్తి ఆగస్టు 31 (తెలంగాణ ముచ్చట్లు):   ఎల్కతుర్తి మండలంలోని గోపాల్‌పూర్ గ్రామంలో ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్‌పీ గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు....
వెలుగొండకు నికర జలాలు తరలిస్తే సహించం.
సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిధి.
కాంగ్రెస్ పాలనా వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరుబాట.
వెల్టూర్ శివాలయానికి  హెచ్‌పీ మోటార్‌ విరాళం.
రాజేంద్రప్రసాద్ యాదవ్‌ను సన్మానించిన చిన్నారెడ్డి.
వనపర్తి–పెద్దమందడి మధ్య ఆర్టీసీ బస్సులు నడపాలి.