రాజేంద్రప్రసాద్ యాదవ్‌ను సన్మానించిన చిన్నారెడ్డి.

రాజేంద్రప్రసాద్ యాదవ్‌ను సన్మానించిన చిన్నారెడ్డి.

వనపర్తి,ఆగస్టు31(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తిలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ అధ్యక్షులుగా నియమితులైన రాజేంద్రప్రసాద్ యాదవ్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం రాజీవ్ గాంధీ గొప్ప ఆలోచన అని పేర్కొన్నారు. గ్రామీణ ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ చురుకైన పాత్ర పోషించాలని సూచించారు.కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసే వారికి అధిష్టానం గుర్తింపు ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. రాజేంద్రప్రసాద్ యాదవ్ కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు, సర్పంచులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గోపాల్‌పూర్‌లో ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్‌పీ గ్రామ కమిటీలు. గోపాల్‌పూర్‌లో ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్‌పీ గ్రామ కమిటీలు.
ఎమ్మార్పీఎస్ గ్రామ ఉపాధ్యక్షులు యెల్తూరి రాజేష్ ఎల్కతుర్తి ఆగస్టు 31 (తెలంగాణ ముచ్చట్లు):   ఎల్కతుర్తి మండలంలోని గోపాల్‌పూర్ గ్రామంలో ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్‌పీ గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు....
వెలుగొండకు నికర జలాలు తరలిస్తే సహించం.
సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిధి.
కాంగ్రెస్ పాలనా వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరుబాట.
వెల్టూర్ శివాలయానికి  హెచ్‌పీ మోటార్‌ విరాళం.
రాజేంద్రప్రసాద్ యాదవ్‌ను సన్మానించిన చిన్నారెడ్డి.
వనపర్తి–పెద్దమందడి మధ్య ఆర్టీసీ బస్సులు నడపాలి.