భక్తిశ్రద్ధల మధ్య నగరపాలక సంస్థ గణనాథుడి నిమజ్జన శోభాయాత్ర.

భక్తిశ్రద్ధల మధ్య నగరపాలక సంస్థ గణనాథుడి నిమజ్జన శోభాయాత్ర.

*వేదమంత్రోచ్ఛారణలు, మంగళహారతుల నడుమ ఘనంగా వీడ్కోలు*

*మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైభవంగా నిమజ్జన వేడుకలు*

కరీంనగర్, సెప్టెంబర్ 23(తెలంగాణ ముచ్చట్లు ):

 కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రతిష్ఠించిన గణనాథుడికి బుధవారం భక్తిశ్రద్ధలతో చివరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు, అభిషేకాలతో కొలిచిన వినాయకుడికి వేదమంత్రోచ్ఛారణలు, మంగళహారతుల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

అనంతరం నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గణనాథుడి విగ్రహాన్ని కదిలించి నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు.

వేదమంత్రాల నడుమ ప్రారంభమైన శోభాయాత్ర భక్తుల సందడి, జై గణేశ్ నినాదాలతో వైభవంగా సాగింది. నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం స్వామివారి విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు.IMG-20260923-WA0009

Tags:

Post Your Comments

Comments

Latest News

పుట్టలమ్మ చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్ ట్రాలీ సేవలు. పుట్టలమ్మ చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్ ట్రాలీ సేవలు.
అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం ఎన్‌పీడీసీఎల్ వినూత్న ఏర్పాటు ఏఈ శంకర్ పర్యవేక్షణలో అప్రమత్తంగా విద్యుత్ సిబ్బంది స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):...
గంగమ్మ ఒడిలోకి గణనాథులు.
కరీంనగర్‌లో ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవం.
మంగంపల్లిలో కబడ్డీ సందడి.
జాషువా సాహిత్యం సామాజిక చైతన్యానికి స్ఫూర్తి.
జర్నలిస్టుల సమస్యలపై సమిష్టి పోరాటం.
భక్తిశ్రద్ధల మధ్య నగరపాలక సంస్థ గణనాథుడి నిమజ్జన శోభాయాత్ర.