పెద్దమందడిలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్.
పెద్దమందడి,సెప్టెంబర్22(తెలంగాణ ముచ్చట్లు):
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు జూరాల ప్రాజెక్టు వద్దకు రానున్న నేపథ్యంలో పెద్దమందడి మండల బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షుడు ముప్పూరి చెన్నయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ పాలన కొనసాగిస్తోందని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన నీటిని ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సాగునీరు అందక రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు.జూరాల ప్రాజెక్టులో సమృద్ధిగా నీరు ఉన్నప్పటికీ ఆయకట్టు కాలువలకు సాగునీటిని విడుదల చేయకుండా తాగునీటి పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని చెన్నయ్య అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత ఉమ్మడి జిల్లాలోనే రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాథుడు లేడని విమర్శించారు.రైతుల పంటలను కాపాడేందుకు జూరాల ప్రాజెక్టు నుంచి ఆయకట్టు కాలువలకు వెంటనే సాగునీటిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ముందస్తుగా అరెస్ట్ అయిన వారిలో మండల ప్రధాన కార్యదర్శి సుక్క మధు, మండల ఉపాధ్యక్షులు సి. రవి, సీనియర్ నాయకులు కిషన్, హనుమంతు నాయక్, శంకర్, మోహన్ నాయక్, గణేష్ నాయక్, శివశంకర్, మహేష్ తదితరులు ఉన్నారు.


Comments