మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా.
పెద్దమందడి మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి.
పెద్దమందడి,సెప్టెంబర్21(తెలంగాణ ముచ్చట్లు):
జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీరు అందక పంటలు ఎండిపోతూ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, రైతుల ధర్నాకు మద్దతుగా వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి గృహనిర్బంధం చేయడాన్ని పెద్దమందడి మాజీ జడ్పిటిసి రఘుపతి రెడ్డి తీవ్రంగా ఖండించారు.రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారి గొంతుకను అణచివేయడం సరికాదని ఆయన అన్నారు. సాగునీరు అందక రైతులు పంటలు నష్టపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.రైతులకు వెంటనే సాగునీరు అందించాలని, పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని రఘుపతి రెడ్డి డిమాండ్ చేశారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై విధించిన గృహనిర్బంధాన్ని వెంటనే ఎత్తివేయాలని, రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు.


Comments