సీఐ శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్‌ఎస్ యువ నేత రాజారపు సుమన్ .
ధర్మసాగర్,సెప్టెంబర్10(తెలంగాణ ముచ్చట్లు):
ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు చేపట్టిన సీఐ శ్రీనివాస్‌ను బీఆర్‌ఎస్ పార్టీ ధర్మసాగర్ మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజారపు సుమన్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఇటీవల బదిలీపై ధర్మసాగర్‌కు వచ్చిన సీఐ శ్రీనివాస్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలియజేశారు. ధర్మసాగర్ మండలంలో శాంతిభద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా పోలీస్ సేవలు అందించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
ప్రజల సమస్యలను సానుకూలంగా పరిష్కరించడంతో పాటు, యువతను చెడు వ్యసనాలకు దూరంగా ఉంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, గ్రామీణ ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పడంలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని రాజారపు సుమన్ పేర్కొన్నారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరిస్తూ మండలంలో ప్రశాంతమైన వాతావరణం కొనసాగేందుకు తమ వంతు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజల సమస్యలను చట్టపరంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదురైనా పోలీసులను సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యువ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన ఎస్‌హెచ్‌ఓకు శుభాకాంక్షలు తెలిపారు.


Comments