విద్యుత్ సమస్యల పరిష్కారమే లక్ష్యం.
సర్పంచ్ గజ్జెల సృజన రమేష్.
వంగరలో విద్యుత్ సమస్యలపై అధికారుల దృష్టికి పలు అంశాలు
భీమదేవరపల్లి, సెప్టెంబర్ 07(తెలంగాణ ముచ్చట్లు):
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎన్‌పీటీసీఎల్ జిల్లా సూపరింటెండెంట్ సోమవారం వంగర గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గజ్జెల సృజన రమేష్ గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
గ్రామంలోని పలు ప్రాంతాల్లో లూజ్ పోల్స్, విద్యుత్ స్తంభాల సమస్యలు, కొత్త విద్యుత్ కనెక్షన్ల అవసరం, స్ట్రీట్ లైట్ల సమస్యలు, విద్యుత్ వైర్లకు సంబంధించిన సమస్యలను సర్పంచ్ అధికారులకు వివరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా సూపరింటెండెంట్ హామీ ఇచ్చారు.
గ్రామంలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని సర్పంచ్ గజ్జెల సృజన రమేష్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రమేష్ సతీష్, తదితరులు పాల్గొన్నారు.


Comments