సరళ రెడ్డి మృతి అత్యంత బాధాకరం.....

సరళ రెడ్డి మృతి అత్యంత బాధాకరం.....

*టీఎస్ ఎన్పీడీసీఎల్ కంపెనీ రాష్ట్ర కార్యదర్శి బొల్లి వెంకటరాజు*

*సీనియర్ రిపోర్టర్ అనిల్ రెడ్డి ని పరామర్శించిన వెంకట్ రాజు అన్నెం సత్యాలు*

ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 5(తెలంగాణ ముచ్చట్లు )

టీవీ9 సీనియర్ రిపోర్టర్ కర్ర అనిల్ రెడ్డి సతీమణి సరళ రెడ్డి మృతి అత్యంత బాధాకరమని ఆమె లేని రోడ్డు ఎవరు తీర్చలేరని టీఎస్ ఎన్పీడీసీఎల్ కంపెనీ కార్యదర్శి బొల్లి వెంకటరాజు అన్నారు. శనివారం మాజీ జెడ్పిటిసి అన్నెం సత్యనారాయణమూర్తి   (సత్యాలు) తో కలిసి సరళ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి రిపోర్టర్ అనిల్ రెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా వెంకటరాజు మాట్లాడుతూ సరళ రెడ్డి చిన్ననాటి నుండి టైలరింగ్ బోటిక్ వంటి వృత్తిలో రాణిస్తూ భర్తకు సహకారంగానే కాక ఎంతో మంది మహిళలకు ఉపాధి చూపించే వారిని అన్నారు. అనిల్ రెడ్డి మీడియా రంగంలో అత్యున్నత స్థాయిలో ఉండటానికి సరళ రెడ్డి సహకారం మరువలేనిదని అన్నారు. చిన్న వయసులోనే సరళ రెడ్డి మృతి చెందటం విషాదకరమని అనిల్ రెడ్డి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నామని అన్నారు. భార్య వియోగం బాధ నుండి అనిల్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాలి. ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు అనిల్ రెడ్డి స్నేహితులు పాల్గొని సరళ రెడ్డి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

సరళ రెడ్డి మృతి అత్యంత బాధాకరం..... సరళ రెడ్డి మృతి అత్యంత బాధాకరం.....
*టీఎస్ ఎన్పీడీసీఎల్ కంపెనీ రాష్ట్ర కార్యదర్శి బొల్లి వెంకటరాజు* *సీనియర్ రిపోర్టర్ అనిల్ రెడ్డి ని పరామర్శించిన వెంకట్ రాజు అన్నెం సత్యాలు* ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్...
మనలోని అజ్ఞానపు పొరలను తొలగించి.. జ్ఞానదీప్తిని వెలిగించేవారే ఉపాధ్యాయులు .
కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ రణభేరి.
ఆధునిక సాగు పద్ధతులతో అధిక దిగుబడులు.
ఫాదర్ కొలంబో పాఠశాలలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు.
ఉపాధ్యాయులే సమాజానికి మార్గదర్శకులు.!
గురువులే భవిష్యత్ తరాలకు దిక్సూచి.