జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా స్వాతి ఎంపిక కావడం గర్వకారణం.

భరత్ భూషణ్ బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు.

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా స్వాతి ఎంపిక కావడం గర్వకారణం.

కొత్తకోట,సెప్టెంబర్05( తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన జే. స్వాతి కిరణ్ కుమార్ను బీజేపీ మహబూబ్‌నగర్ జిల్లా ఉపాధ్యక్షులు కొమ్ము భరత్ భూషణ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్వాతిని శాలువాతో సత్కరించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.కొమ్ము భరత్ భూషణ్ మాట్లాడుతూ.. పేద బీడీ కార్మిక కుటుంబంలో జన్మించిన స్వాతి కష్టపడి చదువుకుని ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడి, తన సేవలతో వనపర్తి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక కావడం ఎంతో గర్వకారణమని అన్నారు. పుట్టిన ఊరు కొత్తకోటతో పాటు మెట్టిన ఊరు అమరచింతకు కూడా స్వాతి మంచి పేరు తీసుకురావడం అభినందనీయమన్నారు.ప్రస్తుతం ఎం.పి.పి.ఎస్. శంకరమ్మపేటలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న స్వాతి, విద్యార్థుల పట్ల అంకితభావంతో పనిచేస్తూ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా గుర్తింపు పొందడం ఎంతో సంతోషకరమని భరత్ భూషణ్ పేర్కొన్నారు. ఆమె మరింత ఉన్నత స్థాయికి ఎదిగి, విద్యార్థుల భవిష్యత్తుకు మరింత సేవలందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఏలీయా బీజేపీ నాయకులు, బోరింగ్ రాములు, మున్సిపల్ కార్మికులు శ్రీమతి శాంతమ్మ జార్జ్, శ్రీమతి పల్లెపాగు రాజేశ్వరి విజయ్ తదితరులు పాల్గొని స్వాతికి అభినందనలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

సరళ రెడ్డి మృతి అత్యంత బాధాకరం..... సరళ రెడ్డి మృతి అత్యంత బాధాకరం.....
*టీఎస్ ఎన్పీడీసీఎల్ కంపెనీ రాష్ట్ర కార్యదర్శి బొల్లి వెంకటరాజు* *సీనియర్ రిపోర్టర్ అనిల్ రెడ్డి ని పరామర్శించిన వెంకట్ రాజు అన్నెం సత్యాలు* ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్...
మనలోని అజ్ఞానపు పొరలను తొలగించి.. జ్ఞానదీప్తిని వెలిగించేవారే ఉపాధ్యాయులు .
కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ రణభేరి.
ఆధునిక సాగు పద్ధతులతో అధిక దిగుబడులు.
ఫాదర్ కొలంబో పాఠశాలలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు.
ఉపాధ్యాయులే సమాజానికి మార్గదర్శకులు.!
గురువులే భవిష్యత్ తరాలకు దిక్సూచి.