కాంగ్రెస్‌లోకి కోర్కల్ సర్పంచ్.. 150 మంది చేరిక.
సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు, కుల సంఘాల ప్రతినిధులు పార్టీ తీర్థం.
వీణవంక, సెప్టెంబర్ 05 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు కొనసాగుతోంది. మండలంలోని కోర్కల్ గ్రామ సర్పంచ్ రమ్యకృష్ణ–అనిల్, వార్డు సభ్యులు, కుల సంఘాల అధ్యక్షులు, వివిధ పార్టీలకు చెందిన సుమారు 150 మంది నాయకులు, కార్యకర్తలు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. హుజూరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొత్తగా చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ ఇసుకపై ఆధారపడి జీవనం సాగిస్తున్న తమకు ఇసుక ట్యాక్స్ ద్వారా ఉపాధి కల్పించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు చేరుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. గ్రామంలోని పలు సమస్యలను ప్రణవ్ దృష్టికి తీసుకెళ్లగా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు: వొడితల ప్రణవ్
ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ నియోజకవర్గవ్యాప్తంగా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమ ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా భారీగా నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరడం శుభపరిణామమన్నారు.
కోర్కల్ గ్రామ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, అవసరమైన నిధులు కేటాయించి గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి పనులు చేపడతామని ప్రణవ్ తెలిపారు.
కార్యక్రమంలో వీణవంక మండల ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షుడు, మండల నాయకులు, మైనారిటీ నా
యకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments