లబ్ధిదారులకు సంక్షేమ పథకాల పంపిణీ.
పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.
మానకొండూర్ , సెప్టెంబర్ 5(తెలంగాణ ముచ్చట్లు ):
మండల కేంద్రంలోని కేఎస్ ఫంక్షన్ హాల్‌లో మానకొండూర్ మండలానికి చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, స్మార్ట్ రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి చెక్కులను నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు నిత్యావసర సరుకులు సులభంగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సహాయం అందిస్తూ పేద కుటుంబాలకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోందన్నారు.
నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి, అర్హులైన లబ్ధిదారులు ఎవరూ మిగిలిపోకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.


Comments