ఫాదర్ కొలంబో పాఠశాలలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు.
– ప్రిన్సిపాల్ థామస్ కిరణ్
స్టేషన్ ఘనపూర్,సెప్టెంబర్5(తెలంగాణ ముచ్చట్లు):
స్టేషన్ ఘనపూర్‌లోని ఫాదర్ కొలంబో పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య ఆనందోత్సాహాల నడుమ జరిగిన ఈ వేడుకలు సందడిగా సాగాయి.
కార్యక్రమంలో భాగంగా భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఉపాధ్యాయుల ప్రాధాన్యతను చాటిచెప్పేలా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, కళా ప్రదర్శనలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఫాదర్ థామస్ కిరణ్ మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాలను సరైన దిశలో నడిపిస్తూ, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేసే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, విద్యార్థులను ఉన్నత విలువలతో కూడిన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే ఉపాధ్యాయుల లక్ష్యమని పేర్కొన్నారు.టీచర్స్ డే సందర్భంగా విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పుతున్న అభిమాన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా సత్కరించి, ప్రేమాభిమానాలతో బహుమతులు అందజేశారు. దీంతో పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Comments