మరువలేని మహానేత.. వైఎస్సార్.

మరువలేని మహానేత.. వైఎస్సార్.

* మంత్రి పొంగులేటి క్యాప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి 
* క్యాంప్ ఆఫీస్ లో, పలుచోట్ల ఘన నివాళులు, సేవా కార్యక్రమాల నిర్వహణ

ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్2(తెలంగాణ ముచ్చట్లు )

దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ప్రజల గుండెల్లో ఎప్పటికీ ఉంటారని, మరువలేని మహానేత వైఎస్సార్ అని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి అన్నారు. ఆ మహానేత వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం రాష్ట్ర మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి.. ఘన నివాళులు అర్పించారు. ఏదులాపురం మున్సిపాలిటీ రెండో వార్డు పరిధిలోని రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి..తుంబూరు దయాకర్ రెడ్డి నివాళులర్పించి, అన్నదానం చేశారు. ఖమ్మం రూరల్ మండలం ఎం. వెంకటాయపాలెం లో వైయస్సార్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా.. ఆయా కార్యక్రమాల్లో మంత్రి పొంగలేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి మాట్లాడుతూ..పేదలు, రైతులు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం వైఎస్సార్‌ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌, ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్‌ సేవలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి సామాన్య ప్రజలకు అండగా నిలిచారని కొనియాడారు.  ఆ మహానేత ఆశయాలను కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.
*ఈ కార్యక్రమాల్లో..:* ఏదులాపురం మున్సిపల్ చైర్ పర్సన్ పోకబత్తిన అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్,  ఏదులాపురం మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షులు బానోత్ కిషోర్, ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు తోట వీరభద్రం, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ యడ్లపల్లి సంతోష్, పాలేరు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బానోత్ కిరణ్ కుమార్, కౌన్సిలర్లు ఏనుగు స్వరూప, బానోత్ నాగేంద్రప్రసాద్, బానోత్ దివ్య, బుర్రా మహేష్, నాయకులు భానోత్ సునీల్, హరినాథ్, భూక్యాIMG-20260902-WA0010 లాల్ సింగ్, సర్పంచ్ పాపా నాయక్, బత్తిని మహేష్, లింగా శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

సైబర్‌ నేరాల పట్ల విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. సైబర్‌ నేరాల పట్ల విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి.
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 2(తెలంగాణ ముచ్చట్లు ) సైబర్‌ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఖమ్మం...
దొడగుంటపల్లిలో దోమల నివారణకు పైరిత్రం పిచికారీ.
బీసీ డెవలప్‌మెంట్  అధికారిణి జి.జ్యోతికి కలెక్టర్ దివాకర టిఎస్ అభినందనలు.
సైబర్ నేరాల నివారణపై విద్యార్థులకు అవగాహన.
మహానేత వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.
కిడ్నాప్‌ కేసులో ముగ్గురికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష.
బీఆర్‌ఎస్‌ ధర్నాలు సిగ్గుచేటు.