బీఆర్‌ఎస్‌ ధర్నాలు సిగ్గుచేటు.

మాజీ సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ఫైర్.

బీఆర్‌ఎస్‌ ధర్నాలు సిగ్గుచేటు.

కరీంనగర్, సెప్టెంబర్ 2(తెలంగాణ ముచ్చట్లు ):

పదేళ్లపాటు ప్రజలను మోసం చేసిన బీఆర్‌ఎస్‌.. కాంగ్రెస్‌ ప్రజాపాలనపై ధర్నాలు చేయడం సిగ్గుచేటని మాజీ సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మండిపడ్డారు. కరీంనగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన బీఆర్‌ఎస్‌ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

ఎమ్మెల్యే అధికారిక క్యాంపు కార్యాలయం ముందు కాంగ్రెస్‌ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఫ్లెక్సీ తొలగించకపోతే బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలు, మోసాలను వివరిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ స్వయంగా లబ్ధిదారులకు అందజేస్తుంటే.. పథకాలు అందడం లేదని బీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఎన్ని డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించారో, ఎంతమంది దళితులకు మూడు ఎకరాల భూమి ఇచ్చారో చెప్పి ఆ తర్వాత ధర్నాలకు రావాలని సూచించారు.

కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, అది చూసి బీఆర్‌ఎస్‌ నాయకులు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో పెద్దగా మాట్లాడకపోయినా ప్రతిపక్ష నేత హోదాలో ప్రజాధనం భారీగా ఖర్చయిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ హద్దులు దాటి మాట్లాడటం సరికాదని నరేందర్‌రెడ్డి హితవు పలికారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

సైబర్‌ నేరాల పట్ల విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. సైబర్‌ నేరాల పట్ల విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి.
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 2(తెలంగాణ ముచ్చట్లు ) సైబర్‌ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఖమ్మం...
దొడగుంటపల్లిలో దోమల నివారణకు పైరిత్రం పిచికారీ.
బీసీ డెవలప్‌మెంట్  అధికారిణి జి.జ్యోతికి కలెక్టర్ దివాకర టిఎస్ అభినందనలు.
సైబర్ నేరాల నివారణపై విద్యార్థులకు అవగాహన.
మహానేత వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.
కిడ్నాప్‌ కేసులో ముగ్గురికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష.
బీఆర్‌ఎస్‌ ధర్నాలు సిగ్గుచేటు.