ఓటర్ల జాబితా సవరణపై గ్రామసభ.

చికారు చెట్టు తండాలో ప్రజల అభ్యంతరాలు, సూచనల స్వీకరణ.

ఓటర్ల జాబితా సవరణపై గ్రామసభ.

పెద్దమందడిసెప్టెంబర్01(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలంలోని చికారు చెట్టు తండా గ్రామపంచాయతీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై విచారణ గ్రామసభను మంగళవారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అంగోత్ లలిత కిషన్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ గ్రామసభలో ఓటర్ల జాబితాకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.గ్రామసభలో ఓటర్ల జాబితాను పరిశీలించి అర్హులైన ఓటర్ల వివరాలను పరిశీలించారు. జాబితాలో పేర్లు, వివరాలకు సంబంధించి గ్రామస్తుల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను అధికారులు స్వీకరించారు. ఓటర్ల జాబితాలో తప్పులు ఉంటే వాటిని సరిచేయించుకునే విధానం, అర్హులైన వారు తమ పేర్లను నమోదు చేసుకునే అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.ప్రతి ఓటరు తమ వివరాలను ఒకసారి పరిశీలించుకుని, ఏవైనా తప్పులు లేదా మార్పులు ఉన్నట్లయితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని అధికారులు సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ అధికారి నాగరాజు, పర్యవేక్షకుడు రాజు, ఓటరు నమోదు అధికారి చిట్టెమ్మ, గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రీతి సుధన్, ఉపసర్పంచ్ గుజ్జమ్మతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామసభకు హాజరై సహకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులకు సర్పంచ్ అంగోత్ లలిత కిషన్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఓటర్ల జాబితా సవరణపై గ్రామసభ. ఓటర్ల జాబితా సవరణపై గ్రామసభ.
పెద్దమందడిసెప్టెంబర్01(తెలంగాణ ముచ్చట్లు): పెద్దమందడి మండలంలోని చికారు చెట్టు తండా గ్రామపంచాయతీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై విచారణ గ్రామసభను మంగళవారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అంగోత్...
శిరీష కుటుంబానికి ప్రభుత్వం అండ.!
నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన.
దళితుల భూముల వ్యవహారంపై ఎమ్మెల్యే మేఘారెడ్డిపై బీఆర్‌ఎస్ ఆరోపణలు.
నాడు ఎస్సైగా.. నేడు సీఐగా..
గోపాల్‌పూర్‌లో ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్‌పీ గ్రామ కమిటీలు.
వెలుగొండకు నికర జలాలు తరలిస్తే సహించం.