దళితుల భూముల వ్యవహారంపై ఎమ్మెల్యే మేఘారెడ్డిపై బీఆర్‌ఎస్ ఆరోపణలు.

రిజిస్ట్రేషన్లపై సమగ్ర విచారణ జరపాలి.. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు.

దళితుల భూముల వ్యవహారంపై ఎమ్మెల్యే మేఘారెడ్డిపై బీఆర్‌ఎస్ ఆరోపణలు.

వనపర్తి,సెప్టెంబర్01(తెలంగాణ ముచ్చట్లు): 

వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి దళితులకు చెందిన లావణ్ణి పట్టా భూములను నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని, రెవెన్యూ రికార్డుల్లో పట్టాగా మార్పిడి చేయించుకున్నారని బీఆర్‌ఎస్ నాయకులుIMG-20260901-WA0011 ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాజీ ఎంపీపీ కృష్ణానాయక్, బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి, నాయకులు ఎం.రాజశేఖర్, దొడ్ల రాములు, జాతృ నాయక్ మాట్లాడుతూ.. పెద్దమందడి మండలం వెల్టూర్ శివారులోని సర్వే నంబర్ 517/ఏ 2లో 0.39 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకుని రెవెన్యూ రికార్డుల్లో పట్టా మార్పిడి చేయించుకున్నారని ఆరోపించారు.అదేవిధంగా దోడగుంటపల్లి–అంకూరు మధ్య సోలార్ ప్లాంట్‌కు సంబంధించి ఎస్సీలకు చెందిన 5 ఎకరాల 10 గుంటల లావణ్ణి పట్టా భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారంపైనా విచారణ జరపాలని కోరారు. ఈ వ్యవహారంలో సంబంధిత రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారుల పాత్రపైనా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. భూముల వ్యవహారంపై ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు నాయకులు తెలిపారు. ఎన్నికల అఫిడవిట్‌లో భూములకు సంబంధించిన వివరాలను తప్పుగా చూపించారని ఆరోపిస్తూ కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఆరోపణలు నిర్ధారణ అయితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.నిరంజన్‌రెడ్డికి క్షమాపణ చెప్పాలని ఎన్నికల సమయంలో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డిపై ఎమ్మెల్యే మేఘారెడ్డి చేసిన ఆరోపణలను ఇప్పటివరకు నిరూపించలేకపోయారని బీఆర్‌ఎస్ నాయకులు విమర్శించారు. నిరాధార ఆరోపణలు చేసినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేకు సంబంధించిన మరిన్ని ఆరోపణలను ఆధారాలతో ప్రజల ముందుకు తీసుకొస్తామని తెలిపారు.సమావేశంలో చంద్రశేఖర్ నాయక్, ఎద్దుల సాయికుమార్, వసంత్, జూదం వెంకటేష్, పీన్యా నాయక్, నారాయణ నాయక్, కవితా నాయక్‌తో పాటు పలువురు సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఓటర్ల జాబితా సవరణపై గ్రామసభ. ఓటర్ల జాబితా సవరణపై గ్రామసభ.
పెద్దమందడిసెప్టెంబర్01(తెలంగాణ ముచ్చట్లు): పెద్దమందడి మండలంలోని చికారు చెట్టు తండా గ్రామపంచాయతీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై విచారణ గ్రామసభను మంగళవారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అంగోత్...
శిరీష కుటుంబానికి ప్రభుత్వం అండ.!
నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన.
దళితుల భూముల వ్యవహారంపై ఎమ్మెల్యే మేఘారెడ్డిపై బీఆర్‌ఎస్ ఆరోపణలు.
నాడు ఎస్సైగా.. నేడు సీఐగా..
గోపాల్‌పూర్‌లో ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్‌పీ గ్రామ కమిటీలు.
వెలుగొండకు నికర జలాలు తరలిస్తే సహించం.