నేడు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి పర్యటన.
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్2(తెలంగాణ ముచ్చట్లు )
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురువారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తొలుత ఉదయం 9:20 గంటలకు కూసుమంచి మండలం ఈశ్వర మాదారం నుంచి పర్యటన ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పాలేరులో వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరవుతారు. ఉదయం 10:10 గంటలకు కేశవాపురంలో గ్రామ పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి, ఉదయం 11 గంటలకు ఏదులాపురం మున్సిపాలిటీ టీఎన్జీవోస్ కాలనీ (22వ వార్డు)లో గిరిజన బాలుర పోస్ట్ మెట్రిక్ హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
*పిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ క్యాంప్ ప్రారంభోత్సవం*
ఉదయం 11:30 గంటలకు ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డు లో గల రామకృష్ణ ఫంక్షన్ హాల్ లో పీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రైట్ ఛాయిస్ అకాడమీ ఏర్పాటు చేసిన ఎస్సై, కానిస్టేబుల్ నియామక పరీక్షల ఉచిత కోచింగ్ క్యాంప్ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుజాతనగర్, ఇదే మండలంలోని కొత్త అంజనాపురం, కొత్తగూడెం కార్పొరేషన్ లో పలు ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరవుతారు. *మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్ లో సమీక్ష*
పాల్వంచలోని కలెక్టరేట్ లో భూ రీ సర్వే, ఇందిరమ్మ పథకం, రెవెన్యూ, అటవీ భూముల అంశాలపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశానికి హాజరవుతారు. సాయంత్రం 6:20 గంటల నుంచి ములకలపల్లి, బూర్గంపాడు మండలాల్లో పర్యటిస్తారు.


Comments