దొడగుంటపల్లిలో దోమల నివారణకు పైరిత్రం పిచికారీ.

దొడగుంటపల్లిలో దోమల నివారణకు పైరిత్రం పిచికారీ.

పెద్దమందడి,సెప్టెంబర్02(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని దొడగుంటపల్లి గ్రామంలో జిల్లా సబ్ యూనిట్ అధికారి ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో బుధవారం దోమల నివారణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా సబ్ యూనిట్ అధికారి ఓం ప్రకాష్, స్థానిక వైద్య సిబ్బంది గ్రామాన్ని సందర్శించి పంచాయతీ సిబ్బందిచే గృహాలలో దోమల నివారణకు పైరిత్రం మందును పిచికారీ చేయించారు.ఈ సందర్భంగా వర్షాకాలంలో వచ్చే జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇళ్ల పరిసరాల్లో ఎక్కువ రోజుల పాటు నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. జ్వరాలతో బాధపడుతున్న అనుమానితుల నుంచి రక్త నమూనాలను సేకరించారు.ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ రామస్వామి, జిల్లా ఏఎల్ఓ బృందం సభ్యులు గంధం రాజు, గోపాల్ రెడ్డి, లక్ష్మణ్, సతీష్ కుమార్, ఏఎన్ఎం నాగసుధా, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

సైబర్‌ నేరాల పట్ల విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. సైబర్‌ నేరాల పట్ల విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి.
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 2(తెలంగాణ ముచ్చట్లు ) సైబర్‌ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఖమ్మం...
దొడగుంటపల్లిలో దోమల నివారణకు పైరిత్రం పిచికారీ.
బీసీ డెవలప్‌మెంట్  అధికారిణి జి.జ్యోతికి కలెక్టర్ దివాకర టిఎస్ అభినందనలు.
సైబర్ నేరాల నివారణపై విద్యార్థులకు అవగాహన.
మహానేత వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.
కిడ్నాప్‌ కేసులో ముగ్గురికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష.
బీఆర్‌ఎస్‌ ధర్నాలు సిగ్గుచేటు.