మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.
సీనియర్ కాంగ్రెస్ నాయకులు శీలం అనిల్‌కుమార్.
ఎల్కతుర్తి, సెప్టెంబర్ 2 ( తెలంగాణ ముచ్చట్లు):
మాజీ ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఎల్కతుర్తిలో గ్రామ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు అంబేద్కర్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్సార్ చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను స్మరించుకున్నారు. పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి వైఎస్సార్ చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆశయాలు, ప్రజా సంక్షేమ స్ఫూర్తిని కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు శీలం అనిల్‌కుమార్, మార్కెట్ డైరెక్టర్ గోడిశాల రాజయ్య, మాజీ సర్పంచ్‌లు గోడిశాల యాదగిరి, కొమ్మిడి రాజిరెడ్డి, జనగాని లక్ష్మినారాయణ, సీనియర్ నాయకులు డాక్టర్ రమేశ్, పాక రమేశ్, శ్రీపతి సదానందం, యువ నాయకులు గోడిశాల అర్జున్, గుడేల్లి నవీన్, అంచనగిరి వెంకట్‌తో పాటు నాయకులు, ప్రజాప్రతినిధులు, కమిటీ సభ్యులు, కాంగ్రెస్ అనుబంధ విభాగాల నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Comments