సైబర్ నేరాల పట్ల విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి.
ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి.
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 2(తెలంగాణ ముచ్చట్లు )
సైబర్ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి అన్నారు. బుధవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమేన్స్ డిగ్రీ కాలేజ్ లో సైబర్ జాగృతా దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ. ప్రజలు తమ వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. ఫోన్‌లలో ఓటీపీ, ఓఎల్‌ఎక్స్, పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, కేవైసీలను అప్‌డేట్ చేయమని వచ్చే మెసేజ్‌లకు స్పందించకూ డదన్నారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు 1930 ట్రోల్‌ఫ్రీ నం బర్‌కు డయల్ చేయాలన్నారు. సైబర్ క్రైమ్‌కు గురైన వెంటనే ఫిర్యాదు చేస్తే డబ్బులు రికవరీ చేసే అవకాశం ఉంటుందని అన్నారు. ఇటీవల కాలంలో మహిళలు, పిల్లలను టార్గెట్ చేసుకుని సైబర్ నేరాలు పెరుగుతున్నా యన్నారు. ఇంటర్నెట్‌ను పరిమితికిమించి వాడకూడదని సూచించారు. సైబర్ నేరగాళ్లు రోజుకో రీతిలో ప్రజలను మోసం చేసి, డబ్బులు కాజేస్తున్నారన్నారు. ఆన్‌లైన్ ద్వారా లావాదేవీలు నడిపేవారు కొత్త వ్యక్తుల మాటలను నమ్మరాదని, తెలియని మెసేజ్‌లపై క్లిక్ చేయరాదని తెలిపారు. సైబర్ నేరగాళ్లు మాయ మాటలు చెప్తూ బహుమతులు వచ్చాయని, లాటరీ తగిలిందని, లోన్లు ఇస్తామని , ఇతరత్రా ఆశచూపి ఆన్‌లైన్ ద్వారా డబ్బులకు ఎర వేస్తారని, అటువంటి వ్యక్తులు పంపే మెసేజ్‌లకు స్పందించ రాదని తెలిపారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ ప్రతి రోజూ కేటుగాళ్లు కొత్తపుంతలు తొక్కుతూ అమాయకుల నుంచి వేలు, లక్షలు, కోట్లు కాజేస్తున్నారు. ఇటీవల కాలంలో అన్ని ప్రాంతాల్లో డిజిటల్ అరెస్ట్ మోసాలు పెరిగిపోయాయని,ఈ డిజిటల్ అరెస్టు అనేది కూడా ఒక రకమైన సైబర్ మోసమని, ఇందులో కేటుగాళ్లు.. ప్రభుత్వ అధికారుల మాదిరిగా నటిస్తూ బురిడీ కొట్టిస్తారన్నారు. బాధితులను భయాందోళనలకు గురి చేసి అందినకాడికి దోచుకుని ఉడాయిస్తారని అన్నారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు మోహన్ బాబు, కరుణాకర్, బాలకృష్ణ, ఉస్మాన్ షరీఫ్ ప్రిన్సిపాల్ బానోత్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


Comments