వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.

వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.

జవహర్‌నగర్, సెప్టెంబర్ 2 (తెలంగాణ ముచ్చట్లు):

జవహర్‌నగర్ డివిజన్, చంద్రపురి కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ హాజరై వైఎస్సార్ సేవలను స్మరించుకున్నారు. పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వైఎస్సార్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు.
ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయని నాయకులు గుర్తు చేశారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జవహర్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మేయర్ శాంతి కోటేశ్ గౌడ్, చంద్రపురి కాలనీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్, మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కారింగుల శంకర్ గౌడ్, జిల్లా జనరల్ సెక్రటరీ కల్లేపల్లి సదానంద్, యువజన అధ్యక్షులు మాట్ల వినయ్తో పాటు మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్సార్‌కు ఘన నివాళులు అర్పించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

సైబర్‌ నేరాల పట్ల విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. సైబర్‌ నేరాల పట్ల విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి.
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 2(తెలంగాణ ముచ్చట్లు ) సైబర్‌ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఖమ్మం...
దొడగుంటపల్లిలో దోమల నివారణకు పైరిత్రం పిచికారీ.
బీసీ డెవలప్‌మెంట్  అధికారిణి జి.జ్యోతికి కలెక్టర్ దివాకర టిఎస్ అభినందనలు.
సైబర్ నేరాల నివారణపై విద్యార్థులకు అవగాహన.
మహానేత వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.
కిడ్నాప్‌ కేసులో ముగ్గురికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష.
బీఆర్‌ఎస్‌ ధర్నాలు సిగ్గుచేటు.