సర్కారుకు సెగ పుట్టించిన... గులాబీ శ్రేణులు.                      

సర్కారుకు సెగ పుట్టించిన... గులాబీ శ్రేణులు.                      

    వంట వార్పుతో.. దండు కట్టారు దడ పుట్టించారు.                     జాబ్ క్యాలెండర్ అంటూ ఊదరగొట్టి... విద్యార్థులను నిండా ముంచారు.                

వంటా వార్పుతో నైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి.                

మేడ్చల్ నియోజకవర్గం బిఆర్ఎస్ ఇంచార్జి మహేందర్ రెడ్డి, మాజీ మేయర్ కావ్య.                     

జవహర్ నగర్ సెప్టెంబర్ 5, (తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణ ప్రజల బతుకులు ఆగమైపోయతాయని... ఉద్యమం చేసి మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణను సాధిస్తే కాంగ్రెస్ పాలనలో ఆకలి కేకల రాజ్యమేలుతున్నాయని పనులు దొరకపోవడంతో ప్రజలు దిక్కుతోచని దుస్థితిలో ఉన్నారని ఉద్యమ సమయంలోనే చేసిన వంటావార్పు మళ్ళీ చేయాల్సిన పరిస్థితి దాపురించిందని మేడ్చల్ నియోజకవర్గం బిఆర్ఎస్ ఇంచార్జి చామకూర మహేందర్రెడ్డి మాజీ మేయర్ మేకల కావ్య దుయ్యబట్టారు.బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు కాంగ్రెస్ వైఫల్యాలపై చేపట్టిన వారం రోజులు నిరసన కార్యక్రమాల్లో భాగంగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో శనివారం వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహేందర్రెడ్డి మాజీ మేయర్ మేకల కావ్య హాజరై మాట్లాడుతూ మహిళలకు ఇస్తామన్న హామీలను ప్రభుత్వం మర్చిపోయిందని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై కోర్టుల సాకుతో కాలం వెలుబుచ్చడం దారుణం అన్నారు. ఉద్యమ రోజులు గుర్తుకు వస్తున్నాయని ప్రజా పాలనలో ప్రజలవరు సంతోషంగా లేరని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి ఉద్యోగ కార్మిక సమస్యలు సహా ప్రతి రంగాన్ని కాంగ్రెస్ గాలికి వదిలేసిందన్నారు. ఉపాధి లేక యువత పెడదారణ పడుతుందని విద్యార్థులకు స్కాలర్షిప్లు విడుదల చేయలేకపోవడంతో యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. కమిషన్ల పై ఉన్న ఆసక్తి  ప్రజాసేవపై లేదని ఎద్దేవ చేశారు. హామీలు నెరవేర్చేదాంక విశ్రమించేది లేదని అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. జవహర్ నగర్ బి ఆర్ ఎస్ హయాంలోనే ప్రగతి చెందిందని కాంగ్రెస్ నాయకులు అదే రోడ్డు మీద నిలబడి గొప్పలు పలకడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు అవుతుందన్నారు. జవహర్ నగర్ నా గుండెకాయ అంటూ మల్లారెడ్డి జూబ్లీహిల్స్ తరహాలో  అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ పాటలతో బిఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. వంటావార్పుతో నిరసన తెలుపుతూ 900 మంది పేద ప్రజలకు బిఆర్ఎస్ నాయకులు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ అధ్యక్షుడు కొండల్, ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు జిట్టా శ్రీనివాసరెడ్డి, మాజీ కార్పొరేటర్లు సంగీత రాజశేఖర్, శ్రీ వాణి, రవి, సతీష్, నాయకులు, వెంకటేష్  ప్రసాద్ గౌడ్, బాలరాజ్ పటేల్, పంతంగి సిద్ధులు యాదవ్, శ్రీరాములు, దిలీప్ అహ్మద్ పాషా, సాయి ,అశోక్, మహేష్, సోమయ్య, రాజేష్, విలాసాగర్ రవి, లక్ష్మణ్, ప్రశాంత్, కేతమ్మ, మంజుల, లక్ష్మి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారుIMG-20260905-WA0040

Tags:

Post Your Comments

Comments

Latest News

సరళ రెడ్డి మృతి అత్యంత బాధాకరం..... సరళ రెడ్డి మృతి అత్యంత బాధాకరం.....
*టీఎస్ ఎన్పీడీసీఎల్ కంపెనీ రాష్ట్ర కార్యదర్శి బొల్లి వెంకటరాజు* *సీనియర్ రిపోర్టర్ అనిల్ రెడ్డి ని పరామర్శించిన వెంకట్ రాజు అన్నెం సత్యాలు* ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్...
మనలోని అజ్ఞానపు పొరలను తొలగించి.. జ్ఞానదీప్తిని వెలిగించేవారే ఉపాధ్యాయులు .
కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ రణభేరి.
ఆధునిక సాగు పద్ధతులతో అధిక దిగుబడులు.
ఫాదర్ కొలంబో పాఠశాలలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు.
ఉపాధ్యాయులే సమాజానికి మార్గదర్శకులు.!
గురువులే భవిష్యత్ తరాలకు దిక్సూచి.