ఉపాధ్యాయుల సేవలు అభినందనీయం.

ఉపాధ్యాయుల సేవలు అభినందనీయం.

టీచర్స్ డే సందర్భంగా పలు పాఠశాలల్లో జమాత్ ఇస్లామీ హింద్ మహిళా విభాగం సందర్శన

ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 5(తెలంగాణ ముచ్చట్లు )

ఉపాధ్యాయుల సేవలను, వారి త్యాగాలను స్మరించుకుంటూ సెప్టెంబర్ 5న టీచర్స్ డే సందర్భంగా జమాత్ ఇస్లామీ హింద్ ఖమ్మం నార్త్ ఆధ్వర్యంలో మహిళా విభాగం పలు పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయులకు పుష్పగుచ్ఛాలు, బహుమతులు అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల, సెంచరీ స్కూల్, సిటిజన్ స్కూల్, బల్లేపల్లి ప్రభుత్వ పాఠశాల, ఖానాపురం ప్రభుత్వ పాఠశాల, ఇంద్రానగర్ ప్రభుత్వ పాఠశాల తదితర పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా మహిళా విభాగం ప్రతినిధులు మాట్లాడుతూ, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనదని పేర్కొన్నారు. విద్యార్థులకు కేవలం విద్యను అందించడమే కాకుండా, వారిలో క్రమశిక్షణ, విలువలు, బాధ్యతాయుతమైన పౌరసత్వ భావనలను పెంపొందించడంలో ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు చేస్తున్న సేవలు, త్యాగాలు సమాజానికి ఎంతో విలువైనవని కొనియాడారు. “ఉపాధ్యాయులు ఒక విద్యార్థి జీవితాన్ని మాత్రమే కాదు… ఒక మంచి సమాజం మరియు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శిల్పి.” ఈ కార్యక్రమంలో ఖమ్మం నార్త్ అధ్యక్షురాలు హుసైన్బీ , సబీహా, హఫీజా, తన్వీర్, తబస్సుమ్, సీమా, సాజిదా, ఆఫియా, ఫాతిమా జబీన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

సరళ రెడ్డి మృతి అత్యంత బాధాకరం..... సరళ రెడ్డి మృతి అత్యంత బాధాకరం.....
*టీఎస్ ఎన్పీడీసీఎల్ కంపెనీ రాష్ట్ర కార్యదర్శి బొల్లి వెంకటరాజు* *సీనియర్ రిపోర్టర్ అనిల్ రెడ్డి ని పరామర్శించిన వెంకట్ రాజు అన్నెం సత్యాలు* ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్...
మనలోని అజ్ఞానపు పొరలను తొలగించి.. జ్ఞానదీప్తిని వెలిగించేవారే ఉపాధ్యాయులు .
కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ రణభేరి.
ఆధునిక సాగు పద్ధతులతో అధిక దిగుబడులు.
ఫాదర్ కొలంబో పాఠశాలలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు.
ఉపాధ్యాయులే సమాజానికి మార్గదర్శకులు.!
గురువులే భవిష్యత్ తరాలకు దిక్సూచి.