స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో ఉత్సాహంగా స్వయంపాలన దినోత్సవం.
విద్యార్థులే ఉపాధ్యాయులుగా పాఠాల బోధన.
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 5(తెలంగాణ ముచ్చట్లు )
స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో స్వయంపాలన దినోత్సవంను
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం ఘనంగా నిర్వహించారు.
విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తరగతులు బోధించడం ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రత్యేక వస్త్రధారణలో డిఈఓ గా, హెడ్మాస్టర్ గా పలు సబ్జెక్టుల ఉపాధ్యాయులుగా, పిఈటిలుగా,అటెండర్ గా వ్యవహరించి విద్యార్థులకు పాఠాలను బోధించారు.
తొలుత సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ పాఠశాలలో ఉపాధ్యాయుల పనితీరును తెలుసుకోవడానికి స్వయంపాలన దినోత్సవం నిర్వహించామన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను అన్ని రంగాలలో తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తున్న తీరును స్వయంపాలన దినోత్సవం ద్వారా తెలియజేశామన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గురువుగా విద్యార్థులను తీర్చిదిద్ది, భారత రెండవ రాష్ట్రపతిగా విధులు నిర్వహించి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారని తెలియజేశారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులందరినీ పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య,ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు,విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.


Comments