గురువుకు వందనం.. జ్ఞానానికి అభివందనం.

గురువుకు వందనం.. జ్ఞానానికి అభివందనం.

* ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

* గురువులను సన్మానించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

జమ్మికుంట టౌన్ సెప్టెంబర్ 05 (తెలంగాణ ముచ్చట్లు):

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ సేవ పథకం ఆధ్వర్యంలో గురువుల సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ముఖ్య అతిథిగా హాజరై అధ్యాపకులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “గురువుకు వందనం.. జ్ఞానానికి అభివందనం” అని పేర్కొన్నారు. జీవితంలో మనకు దిశానిర్దేశం చేసిన ప్రతి గురువును స్మరించుకునే రోజే ఉపాధ్యాయ దినోత్సవమన్నారు. అక్షరాలు నేర్పిన తొలి గురువు నుంచి జీవిత విలువలను బోధించిన ప్రతి ఉపాధ్యాయుడి కృషి విద్యార్థుల ఎదుగుదలలో చెరగని ముద్ర వేస్తుందని తెలిపారు.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. పేదరికం ఆయనకు అడ్డంకి కాలేదని, అవకాశాల కొరత లక్ష్యాన్ని ఆపలేదని, నిరంతర అధ్యయనం, జ్ఞానపిపాస, పట్టుదలతో దేశ అత్యున్నత పదవిని అధిరోహించారని గుర్తుచేశారు. అందుకే సెప్టెంబర్ 5 కేవలం వేడుక మాత్రమే కాదని, గురువు విలువను గుర్తుచేసుకునే రోజని అన్నారు.
విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రహరీ గోడ నిర్మాణం పూర్తయ్యేలా తాను మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న సమయంలో చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎం. కుమార్, జాతీయ సేవ పథకం అధికారులు కే. తిరుపతి, ఈ. జ్యోత్స్నాదేవకి, అధ్యాపకులు చ. విశ్వనాథ్ రెడ్డి, జి. ప్రభాకర్, డి. మహేష్, ఎం. శ్రీధర్, ఎస్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.IMG-20260905-WA0060

Tags:

Post Your Comments

Comments

Latest News

సరళ రెడ్డి మృతి అత్యంత బాధాకరం..... సరళ రెడ్డి మృతి అత్యంత బాధాకరం.....
*టీఎస్ ఎన్పీడీసీఎల్ కంపెనీ రాష్ట్ర కార్యదర్శి బొల్లి వెంకటరాజు* *సీనియర్ రిపోర్టర్ అనిల్ రెడ్డి ని పరామర్శించిన వెంకట్ రాజు అన్నెం సత్యాలు* ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్...
మనలోని అజ్ఞానపు పొరలను తొలగించి.. జ్ఞానదీప్తిని వెలిగించేవారే ఉపాధ్యాయులు .
కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ రణభేరి.
ఆధునిక సాగు పద్ధతులతో అధిక దిగుబడులు.
ఫాదర్ కొలంబో పాఠశాలలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు.
ఉపాధ్యాయులే సమాజానికి మార్గదర్శకులు.!
గురువులే భవిష్యత్ తరాలకు దిక్సూచి.