పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న ఇందిరమ్మ ఇళ్లు.
మాచనపల్లిలో 10 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీల పంపిణీ.
జమ్మికుంట టౌన్ సెప్టెంబర్ 5 (తెలంగాణ ముచ్చట్లు):
ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం అండగా నిలుస్తోంది. జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామంలో పది మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలు గ్రామ సర్పంచ్ పర్లపల్లి విజయ్ కుమార్ స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ప్రొసీడింగ్ కాపీలను అందజేయడంతో గ్రామంలో సంతోషకర వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా సర్పంచ్ విజయ్ కుమార్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో మరింత మంది అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా గ్రామస్థాయిలో ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని చెప్పారు. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాలకు సొంతింటి భరోసా కలుగుతోందని, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని సర్పంచ్ తెలిపారు.
కార్యక్రమంలో వార్డు సభ్యులతో పాటు మాచన
పల్లి గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు ఓరుగంటి రవీందర్ రావు, వేల్పుల ప్రశాంత్, గుర్రపు సంపత్ రెడ్డి, ముష్కి సదానందం, ఇటుకల సదానందం, వేల్పుల గణేష్, రంజిత్, అన్వేష్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


Comments