ఘనంగా మదర్ థెరిసా 29వ వర్ధంతి.

ఘనంగా మదర్ థెరిసా 29వ వర్ధంతి.
మదర్ థెరిస్సా విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పిస్తున్న నాయకులు

కాజీపేట్ సెప్టెంబర్ 5 ( తెలంగాణ ముచ్చట్లు)

 పునీతమదర్ థెరిస్సా 29వ వర్ధంతిని పురస్కరించుకొని
కాజీ పేట లోని ఫాతిమా జంక్షన్ లో నున్న మదర్ థెరిస్సా విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరై మదర్ థెరిస్సా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఫాతిమా చర్చ్ విచారణ గురువు కాసు మర్రెడ్డి ప్రార్థనలు జరిపారు. మదర్ తెరిసా వర్ధంతి తో పాటు 9 వ సెంట్ వుడ్ పునీతులుగా ఆమె సేవలను స్మరించుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ తెలుగు అకాడమీ చైర్మన్ పుల్లూరు సుధాకర్  ప్రెసిడెంట్ ఫోరమ్ ఫర్ బెటర్ వరంగల్ డాక్టర్ తిరునహరి శేషు విగ్రహ కమిటీ కన్వీనర్ ఆర్ రాజ మోహన్ రావు, ప్రకాష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, భాస్కర్, దయాసాగర్, ఇన్నరెడ్డి, నాతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

సరళ రెడ్డి మృతి అత్యంత బాధాకరం..... సరళ రెడ్డి మృతి అత్యంత బాధాకరం.....
*టీఎస్ ఎన్పీడీసీఎల్ కంపెనీ రాష్ట్ర కార్యదర్శి బొల్లి వెంకటరాజు* *సీనియర్ రిపోర్టర్ అనిల్ రెడ్డి ని పరామర్శించిన వెంకట్ రాజు అన్నెం సత్యాలు* ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్...
మనలోని అజ్ఞానపు పొరలను తొలగించి.. జ్ఞానదీప్తిని వెలిగించేవారే ఉపాధ్యాయులు .
కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ రణభేరి.
ఆధునిక సాగు పద్ధతులతో అధిక దిగుబడులు.
ఫాదర్ కొలంబో పాఠశాలలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు.
ఉపాధ్యాయులే సమాజానికి మార్గదర్శకులు.!
గురువులే భవిష్యత్ తరాలకు దిక్సూచి.