కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడిగా ఇల్లందుల శ్రీనివాస్.

నియామక పత్రం అందజేసిన నియోజకవర్గ ఇన్‌ఛార్జి వొడితల ప్రణవ్‌.

కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడిగా ఇల్లందుల శ్రీనివాస్.

హుజూరాబాద్‌,సెప్టెంబర్ 05(తెలంగాణ ముచ్చట్లు ):

హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడిగా జూపాక గ్రామానికి చెందిన ఇల్లందుల శ్రీనివాస్‌ నియమితులయ్యారు. ఈ మేరకు నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి వొడితల ప్రణవ్‌ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా వొడితల ప్రణవ్‌ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ఎస్సీ వర్గాల సమస్యల పరిష్కారానికి నూతన నాయకత్వం కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి శాయశక్తులా కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు ఇల్లందుల శ్రీనివాస్‌ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నేరెళ్ల మహేందర్‌, మండల అధ్యక్షుడు కొలుగూరి కిరణ్‌, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బండి మహేశ్‌, మాజీ ఎంపీటీసీ కేతిరి రాజిరెడ్డి, సమ్మక్క-సారలమ్మ దేవస్థానం మాజీ ఛైర్మన్‌ దాసరి సదయ్య, మాజీ సర్పంచ్‌ పొలంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు తాళ్లపల్లి కుమార్‌, ఇల్లందుల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

సరళ రెడ్డి మృతి అత్యంత బాధాకరం..... సరళ రెడ్డి మృతి అత్యంత బాధాకరం.....
*టీఎస్ ఎన్పీడీసీఎల్ కంపెనీ రాష్ట్ర కార్యదర్శి బొల్లి వెంకటరాజు* *సీనియర్ రిపోర్టర్ అనిల్ రెడ్డి ని పరామర్శించిన వెంకట్ రాజు అన్నెం సత్యాలు* ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్...
మనలోని అజ్ఞానపు పొరలను తొలగించి.. జ్ఞానదీప్తిని వెలిగించేవారే ఉపాధ్యాయులు .
కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ రణభేరి.
ఆధునిక సాగు పద్ధతులతో అధిక దిగుబడులు.
ఫాదర్ కొలంబో పాఠశాలలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు.
ఉపాధ్యాయులే సమాజానికి మార్గదర్శకులు.!
గురువులే భవిష్యత్ తరాలకు దిక్సూచి.