తాటికాయలలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు.

ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులను సన్మానించిన పెసరు రమేష్.

తాటికాయలలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు.

ధర్మసాగర్,సెప్టెంబర్5(తెలంగాణ ముచ్చట్లు):

గురుపూజోత్సవం (టీచర్స్ డే) సందర్భంగా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలోని ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులను మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ ధర్మసాగర్ మండల అధ్యక్షులు పెసరు రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా పెసరు రమేష్ మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు అందించడంతో పాటు వారిలో క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించడంలో ఉపాధ్యాయులు చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సేవలను గుర్తించి వారిని సన్మానించడం ఎంతో గర్వకారణమని అన్నారు.

ఈ కార్యక్రమంలో తాటికాయల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు  బి. ఫాతిమా మేరితో పాటు ఉపాధ్యాయులు నవీన్ కుమార్, ఉషారాణి, పాశికంటి శ్రీనివాస్, వసుంధర, బండి రాజు, దీప్తి, ఇంద్రాణి రాజు, హేమలత, యామిని, భాగ్యలక్ష్మి తదితరులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో తాటికాయల ఉపసర్పంచ్ పెసరు శివకృష్ణ, వార్డు సభ్యులు పెసరు స్వామి, పిట్టల రంజిత్, బొల్లెపాక సంపత్, దువ్వల సుమన్, కృష్ణవేణి, బుల్లయ్య, మాజీ విద్యా కమిటీ చైర్మన్ నీల రమేష్ తదితరులు పాల్గొన్నారు.IMG-20260905-WA0023

Tags:

Post Your Comments

Comments

Latest News

సరళ రెడ్డి మృతి అత్యంత బాధాకరం..... సరళ రెడ్డి మృతి అత్యంత బాధాకరం.....
*టీఎస్ ఎన్పీడీసీఎల్ కంపెనీ రాష్ట్ర కార్యదర్శి బొల్లి వెంకటరాజు* *సీనియర్ రిపోర్టర్ అనిల్ రెడ్డి ని పరామర్శించిన వెంకట్ రాజు అన్నెం సత్యాలు* ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్...
మనలోని అజ్ఞానపు పొరలను తొలగించి.. జ్ఞానదీప్తిని వెలిగించేవారే ఉపాధ్యాయులు .
కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ రణభేరి.
ఆధునిక సాగు పద్ధతులతో అధిక దిగుబడులు.
ఫాదర్ కొలంబో పాఠశాలలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు.
ఉపాధ్యాయులే సమాజానికి మార్గదర్శకులు.!
గురువులే భవిష్యత్ తరాలకు దిక్సూచి.