ప్రపంచానికి మార్గదర్శకులు ఉపాధ్యాయులే.
కొత్తపల్లి గార్డియన్ పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.
జమ్మికుంట టౌన్ సెప్టెంబర్ 05 (తెలంగాణ ముచ్చట్లు):
ఉపాధ్యాయులు ప్రపంచానికి మార్గదర్శకులని, అన్ని వృత్తులకు రూపకల్పన చేసే గొప్ప వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ అన్నారు. డా. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం కొత్తపల్లిలోని గార్డియన్ పాఠశాలలో ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
పాఠశాల ప్రిన్సిపాల్ మహమ్మద్ అంకూస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఐ రామకృష్ణ గౌడ్ హాజరయ్యారు. తొలుత డా. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం సీఐ మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఉపాధ్యాయులు బోధించే పాఠాలను శ్రద్ధగా విని, క్రమశిక్షణతో మెలుగుతూ ఉత్తమ పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. సమాజంలో మంచి పేరు, ప్రతిష్టలు సాధించేలా ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
అనంతరం పాఠశాలలోని ఉపాధ్యాయ బృందాన్ని శాలువాలు, పూల బొకేలతో ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో టీపీటీఎల్ఏ అధ్యక్షుడు రహమాన్, సీనియర్ జర్నలిస్టులు నసిరుద్దీన్, యూసుఫ్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Comments