ఉపాధ్యాయులే జాతి నిర్మాతలు.

ఉపాధ్యాయులే జాతి నిర్మాతలు.

విద్యతో పాటు విలువలు, సంస్కారం, క్రమశిక్షణను అందించేది గురువులే

-- పలుస శంకర్ గౌడ్ జిల్లా సాహితీ కళావేదిక అధ్యక్షులు 

వనపర్తి,సెప్టెంబర్05(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి పట్టణంలోని శ్రీనివాస్‌పూర్ మండల పరిషత్ పాఠశాలలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సాహితీ కళావేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శంభావి, ఉపాధ్యాయులు శ్వేత, రాజేశ్వరిలను శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ ఉపాధ్యాయులే జాతి నిర్మాతలు అని అన్నారు. గురువులు విద్యార్థులకు విద్యతో పాటు విలువలు, సంస్కారం, క్రమశిక్షణను నేర్పి వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తారని పేర్కొన్నారు.ముగ్గురు ఉపాధ్యాయుల సేవలు అభినందనీయమని, వారి మార్గదర్శకత్వంలోనే విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దబడుతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు.పాఠశాల అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని కౌన్సిలర్లు విభూతి మహేశ్వరి, ముదావత్ శంకరమ్మ, బాబు నాయక్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉమ్మల రాములు, గ్రామ పెద్దలు లక్ష్మయ్య, రాములు, వినయ్, తిరుపతి, రమేష్, శాంతన్న, ఆంజనేయులు, తల్లిదండ్రులు, పాఠశాల నిర్వహణ సంఘం సభ్యులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

సరళ రెడ్డి మృతి అత్యంత బాధాకరం..... సరళ రెడ్డి మృతి అత్యంత బాధాకరం.....
*టీఎస్ ఎన్పీడీసీఎల్ కంపెనీ రాష్ట్ర కార్యదర్శి బొల్లి వెంకటరాజు* *సీనియర్ రిపోర్టర్ అనిల్ రెడ్డి ని పరామర్శించిన వెంకట్ రాజు అన్నెం సత్యాలు* ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్...
మనలోని అజ్ఞానపు పొరలను తొలగించి.. జ్ఞానదీప్తిని వెలిగించేవారే ఉపాధ్యాయులు .
కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ రణభేరి.
ఆధునిక సాగు పద్ధతులతో అధిక దిగుబడులు.
ఫాదర్ కొలంబో పాఠశాలలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు.
ఉపాధ్యాయులే సమాజానికి మార్గదర్శకులు.!
గురువులే భవిష్యత్ తరాలకు దిక్సూచి.