శ్రీ ఆదర్శలో స్వయంపాలన దినోత్సవం .

శ్రీ ఆదర్శలో స్వయంపాలన దినోత్సవం .

ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 5(తెలంగాణ ముచ్చట్లు )

 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని నాగులవంచ శ్రీ ఆదర్శ హై స్కూల్లో శనివారం స్వయంపాలన దినోత్సవం నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణ జీవిత చరిత్రను పాఠశాల కరస్పాండెంట్ బోడేపూడి కిరణ్ విద్యార్థులకు వివరించారు.‌ విద్యార్థులు ఉన్నత భావాలతో ఆదర్శవంతంగా ఎదగాలని ఆయన సూచించారు. విద్యార్థులే ఉపాధ్యాయుల అవతారాలు ఎత్తి రోజంతా పాఠాలు బోధించారు.  విద్యార్థుల పాఠ్యాంశ బోధన ఆకట్టుకుంది.  విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించడంతో పాఠశాలలో సందడి వాతావరణం నెలకొంది. బోధనలో  అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ చావా అరుణ్ కుమార్, ఉపాధ్యాయులు జొన్నలగడ్డ శ్రీనివాస్, బోళ్ళ రేణుక, అమరబోయిన సురేష్, పార్వతి, చందన, రాశి, సుజిత, శైలజ పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

సరళ రెడ్డి మృతి అత్యంత బాధాకరం..... సరళ రెడ్డి మృతి అత్యంత బాధాకరం.....
*టీఎస్ ఎన్పీడీసీఎల్ కంపెనీ రాష్ట్ర కార్యదర్శి బొల్లి వెంకటరాజు* *సీనియర్ రిపోర్టర్ అనిల్ రెడ్డి ని పరామర్శించిన వెంకట్ రాజు అన్నెం సత్యాలు* ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్...
మనలోని అజ్ఞానపు పొరలను తొలగించి.. జ్ఞానదీప్తిని వెలిగించేవారే ఉపాధ్యాయులు .
కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ రణభేరి.
ఆధునిక సాగు పద్ధతులతో అధిక దిగుబడులు.
ఫాదర్ కొలంబో పాఠశాలలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు.
ఉపాధ్యాయులే సమాజానికి మార్గదర్శకులు.!
గురువులే భవిష్యత్ తరాలకు దిక్సూచి.