మనలోని అజ్ఞానపు పొరలను తొలగించి.. జ్ఞానదీప్తిని వెలిగించేవారే ఉపాధ్యాయులు .
మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్.
జవహర్ నగర్, సెప్టెంబర్ 5 (తెలంగాణ ముచ్చట్లు):
ఉపాధ్యాయులు సమాజానికి దిశానిర్దేశం చేసే మార్గదర్శకులని.. మన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికులని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ అన్నారు.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని.. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా జవహర్ నగర్ పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఆయన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాలల ఉపాధ్యాయులకు పుష్పగుచ్ఛాలు అందజేసి.. శాలువాలతో ఘనంగా సన్మానించి ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రెడ్డి శెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ.. అమ్మానాన్నల తర్వాత సమాజంలో గురువులకు అత్యున్నత స్థానం ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.
అనంతరం ప్రధానోపాధ్యాయుడు ఆజమ్ మొద్దీన్ మాట్లాడుతూ.. పాఠశాలలో ఏ సమస్య ఉన్నా రెడ్డి శెట్టి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. విద్యార్థుల చదువు కోసం ఎలాంటి సహాయం కోరినా ముందుండి సహకరిస్తున్న మంచి మనసున్న నాయకుడిగా ఆయనను కొనియాడారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల తరఫున మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చందర్ రావు, రాజు యాదవ్, సహదేవ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Comments