శ్రీ గ్లోబల్ హై స్కూల్‌లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.

శ్రీ గ్లోబల్ హై స్కూల్‌లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.

 సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలను కొనియాడిన పాఠశాల డైరెక్టర్ ఇనుకుల్ల దివాకర్ రెడ్డి

ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 5(తెలంగాణ ముచ్చట్లు )

చింతకాని మండలం నాగుల వంచలోని శ్రీ గ్లోబల్ హై స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. భారతదేశ తొలి ఉపరాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ ఇనుకుల్ల దివాకర్ రెడ్డి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన దేశానికి అందించిన విశిష్ట సేవలను, విద్యారంగానికి చేసిన కృషిని కొనియాడారు.
ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఉపాధ్యాయులు కేవలం పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా, విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, బాధ్యత, ఆత్మవిశ్వాసం వంటి సద్గుణాలను పెంపొందిస్తూ సమాజానికి మంచి పౌరులను అందిస్తారని తెలిపారు. గురువుల మార్గదర్శకత్వం విద్యార్థుల జీవితానికి దిశానిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు తమ గురువుల పట్ల గౌరవం, అభిమానాన్ని చాటుకున్నారు.ఉపాధ్యాయుల సేవలను స్మరించుకుంటూ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య సభ్యులు ఇనుకుల్ల దివాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, తిరుపతిరెడ్డి, వాహిని, పాఠశాల ప్రిన్సిపల్ తన్నీరు రామారావు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

సరళ రెడ్డి మృతి అత్యంత బాధాకరం..... సరళ రెడ్డి మృతి అత్యంత బాధాకరం.....
*టీఎస్ ఎన్పీడీసీఎల్ కంపెనీ రాష్ట్ర కార్యదర్శి బొల్లి వెంకటరాజు* *సీనియర్ రిపోర్టర్ అనిల్ రెడ్డి ని పరామర్శించిన వెంకట్ రాజు అన్నెం సత్యాలు* ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్...
మనలోని అజ్ఞానపు పొరలను తొలగించి.. జ్ఞానదీప్తిని వెలిగించేవారే ఉపాధ్యాయులు .
కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ రణభేరి.
ఆధునిక సాగు పద్ధతులతో అధిక దిగుబడులు.
ఫాదర్ కొలంబో పాఠశాలలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు.
ఉపాధ్యాయులే సమాజానికి మార్గదర్శకులు.!
గురువులే భవిష్యత్ తరాలకు దిక్సూచి.