ప్రజావాణి ఫిర్యాదుపై అధికారుల విచారణ.
పెద్దమందడి,సెప్టెంబర్05(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో బీసీలకు ప్రభుత్వం గతంలో కేటాయించిన ప్లాట్ల మధ్యలో ఉన్న బాటను కొందరు వ్యక్తులు కబ్జా చేశారంటూ గ్రామస్తులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన అధికారులు శనివారం గ్రామంలో విచారణ చేపట్టారు.పెద్దమందడి ఎంపీడీవో పరిణత ఆధ్వర్యంలో అధికారులు బాటను పరిశీలించి, గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. గ్రామ సర్పంచ్ మంజుల శ్రీశైలం,మాజీ ఎంపీపీ మన్నెపు రెడ్డి సహకారంతో విచారణ కొనసాగింది. ప్లాట్ల మధ్య ఉన్న బాటను కొందరు ఆక్రమించడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ప్రజావాణిలో అందిన ఫిర్యాదును పరిశీలించి, సంబంధిత రికార్డులు మరియు క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. దీంతో బాట కబ్జా సమస్యకు పరిష్కారం లభిస్తుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు.


Comments