ఉన్నత చదువులకు దూర విద్యా కేంద్రం.. సువర్ణ అవకాశం.

ఉన్నత చదువులకు దూర విద్యా కేంద్రం.. సువర్ణ అవకాశం.

జవహర్‌నగర్  సెప్టెంబర్, 5  (తెలంగాణ ముచ్చట్లు):

ఉన్నత చదువులు అభ్యసించాలనుకునే వారికి సార్వత్రిక విద్య ద్వారా సువర్ణ అవకాశం కల్పిస్తున్నామని సిఆర్పిఎఫ్ డిఐజి డాక్టర్ వీర్రాజు తెలిపారు.
చంద్రపురి కాలనీ డివిజన్ పరిధిలోని అరుంధతినగర్‌లో ఉన్న సిఆర్పిఎఫ్ క్యాంపస్‌లో బీఆర్‌ఏ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో దూర విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ వీర్రాజు మాట్లాడుతూ... విద్యను మధ్యలో నిలిపివేసిన వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దూర విద్య ద్వారా ఉన్నత విద్యను కొనసాగించవచ్చని తెలిపారు.
ఆన్‌లైన్‌లోనూ తరగతులు వినే అవకాశం ఉందని, తక్కువ ఫీజుతో డిగ్రీ అర్హతలు పొందవచ్చని చెప్పారు. దివ్యాంగులకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
సిఆర్పిఎఫ్ క్యాంపస్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిఐజి వీర్రాజు సూచించారు. విద్య ద్వారా తమ వృత్తి నైపుణ్యాలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చని అన్నారు.
అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 9వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గడువు దాటితే అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
మరింత సమాచారం కోసం సిఆర్పిఎఫ్ వైస్ ప్రిన్సిపల్ హరిశంకర్‌ను 9559034477 నంబర్‌లో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ రాజశేఖర్‌తో పాటు సిఆర్పిఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

సరళ రెడ్డి మృతి అత్యంత బాధాకరం..... సరళ రెడ్డి మృతి అత్యంత బాధాకరం.....
*టీఎస్ ఎన్పీడీసీఎల్ కంపెనీ రాష్ట్ర కార్యదర్శి బొల్లి వెంకటరాజు* *సీనియర్ రిపోర్టర్ అనిల్ రెడ్డి ని పరామర్శించిన వెంకట్ రాజు అన్నెం సత్యాలు* ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్...
మనలోని అజ్ఞానపు పొరలను తొలగించి.. జ్ఞానదీప్తిని వెలిగించేవారే ఉపాధ్యాయులు .
కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ రణభేరి.
ఆధునిక సాగు పద్ధతులతో అధిక దిగుబడులు.
ఫాదర్ కొలంబో పాఠశాలలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు.
ఉపాధ్యాయులే సమాజానికి మార్గదర్శకులు.!
గురువులే భవిష్యత్ తరాలకు దిక్సూచి.