పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన ఉపాధ్యాయుడికి అభినందనలు.
-- పలుస శంకర్ గౌడ్ జిల్లా సాహితీ కళావేదిక అధ్యక్షులు .
పెబ్బేరు,సెప్టెంబర్04(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని చెంచువాడ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి విశేష కృషి చేసిన ఉపాధ్యాయుడు డి. చిన్న రాములుకు 2026 సంవత్సరానికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం లభించడం అభినందనీయమని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ అన్నారు.2024 జూలైలో చెంచువాడ పాఠశాలకు వచ్చిన సమయంలో కేవలం 40 మంది విద్యార్థులు ఉండగా, పాఠశాల ఆవరణ పొదలు, మట్టి దిబ్బలతో అధ్వానంగా ఉండేదన్నారు. స్థానికుల సహకారంతో పాఠశాల ఆవరణను శుభ్రం చేసి అభివృద్ధి చేయడంతోపాటు, వినూత్న కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. దీంతో విద్యార్థుల సంఖ్య 2025–26లో 96కు, 2026–27లో 136కు పెరిగిందన్నారు.తరగతి గదుల కొరత ఉన్నప్పటికీ సొంత ఖర్చులు, దాతల సహకారంతో రేకుల షెడ్డు ఏర్పాటు చేసి విద్యాబోధన కొనసాగించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చిన్న రాములు కృషి ఆదర్శంగా నిలుస్తుందని శంకర్ గౌడ్ పేర్కొన్నారు.


Comments