ఆల్ఫోర్స్‌లో కృష్ణాష్టమి సందడి.

కృష్ణుడి వేషధారణలో చిన్నారులు.

ఆల్ఫోర్స్‌లో కృష్ణాష్టమి సందడి.

హుజురాబాద్,సెప్టెంబర్ 3(తెలంగాణ ముచ్చట్లు ):

హుజురాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ జీనియస్ పాఠశాలలో ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో పండగ వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో అలరించారు. ఉట్టి వేడుకలను ఉత్సాహంగా నిర్వహిస్తూ విద్యార్థులు సందడి చేశారు. శ్రీకృష్ణుడి బాల్య లీలలను ప్రతిబింబించే నృత్య రూపకాలు, కోలాటాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీకృష్ణుడి జీవితం నుంచి విద్యార్థులు ధైర్యం, ధర్మపోరాట స్ఫూర్తిని నేర్చుకోవాలని సూచించారు. చదువులో, ఆటల్లో ఎలాంటి కష్టాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగాలని అన్నారు.
శ్రీకృష్ణాష్టమికి విశిష్టమైన చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. ధర్మం వైపు నిలిచి, అధర్మాన్ని ఎదుర్కొనే స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఆల్ఫోర్స్‌లో కృష్ణాష్టమి సందడి. ఆల్ఫోర్స్‌లో కృష్ణాష్టమి సందడి.
హుజురాబాద్,సెప్టెంబర్ 3(తెలంగాణ ముచ్చట్లు ): హుజురాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ జీనియస్ పాఠశాలలో ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో పండగ వాతావరణం నెలకొంది.ఈ...
సైబర్‌ నేరాల పట్ల విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి.
దొడగుంటపల్లిలో దోమల నివారణకు పైరిత్రం పిచికారీ.
బీసీ డెవలప్‌మెంట్  అధికారిణి జి.జ్యోతికి కలెక్టర్ దివాకర టిఎస్ అభినందనలు.
సైబర్ నేరాల నివారణపై విద్యార్థులకు అవగాహన.
మహానేత వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.
కిడ్నాప్‌ కేసులో ముగ్గురికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష.