తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భారీ చేరికలు.
*బీఆర్‌ఎస్ నుంచి పెద్ద ఎత్తున చేరికలు.. రంగాపూర్‌లో గ్రామ కమిటీ ఏర్పాటు.
హుజురాబాద్,సెప్టెంబర్ 4(తెలంగాణ ముచ్చట్లు ):
తెలంగాణ రాజ్యాధికార పార్టీ హుజురాబాద్ మండల అధ్యక్షుడు *తిరగమల్ల నాగార్జున* ఆధ్వర్యంలో రంగాపూర్ గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భారీగా చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి నాయకులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు తిరగమల్ల నాగార్జున మాట్లాడుతూ బహుజనులు, పీడిత ప్రజల హక్కుల కోసం ఏర్పాటు చేయబడిన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని అన్నారు. పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను గ్రామంలోని ప్రతి గడపకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి కార్యకర్త తీసుకోవాలని పిలుపునిచ్చారు. హుజురాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా ఎగిరేంత వరకు ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా పనిచేయాలని కోరారు.
బహుజన వర్గాలకు రాజకీయంగా సముచిత ప్రాధాన్యత, సామాజిక న్యాయం అందించడమే పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకమై పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల అధికార ప్రతినిధి బొడ్డు సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగాపూర్ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
రంగాపూర్ గ్రామ కమిటీ:
అధ్యక్షుడిగా బొడ్డు దేవదాసు, ప్రధాన కార్యదర్శిగా బొడ్డు శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బండ ఇస్సాకు, కోశాధికారిగా బొడ్డు తిరుపతి, అధికార ప్రతినిధిగా శ్రీనాథ్, ఉపాధ్యక్షుడిగా బొడ్డు సుమన్, కార్యదర్శిగా బొడ్డు మహేందర్ ఎన్నికయ్యారు.
కార్యక్రమంలో బొడ్డు శ్రీను, బండ రాజేందర్, తునికి రమేష్, బండ రమేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments