యువ సమరభేరి సక్సెస్‌తో బీజేపీ, కాంగ్రెస్‌లో వణుకు.

యువ సమరభేరి సక్సెస్‌తో బీజేపీ, కాంగ్రెస్‌లో వణుకు.

*కరీంనగర్ అభివృద్ధిపై బండి సంజయ్, నగర పాలనపై మేయర్ విఫలం.. బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ ధ్వజం*

కరీంనగర్, సెప్టెంబర్ 6(తెలంగాణ ముచ్చట్లు ):

 కరీంనగర్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన విద్యార్థి, యువ సమరభేరి సభ అపూర్వ విజయాన్ని సాధించడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో భయం మొదలైందని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ అన్నారు. సభ విజయవంతం కాలేదంటూ మేయర్ కోలగాని శ్రీనివాస్ వ్యాఖ్యలు చేయడం బీజేపీ భయానికి నిదర్శనమని పేర్కొన్నారు.

రెండుసార్లు ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కరీంనగర్ అభివృద్ధికి చేసిందేమీ లేదని హరిశంకర్ విమర్శించారు. బీజేపీ నగరపాలక సంస్థలో అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా కేంద్రం నుంచి ఒక్క రూపాయి నిధులు తీసుకురాలేదని ఆరోపించారు. కేవలం జనరల్ ఫండ్స్‌తో పనులు చేపట్టి వాటికి ప్రారంభోత్సవాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.

ఏళ్లు గడుస్తున్నా రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి కాకపోవడం బండి సంజయ్ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. మరోవైపు కరీంనగర్ నగరంలో పారిశుధ్యం పూర్తిగా పడకేసిందని, మేయర్‌గా కోలగాని శ్రీనివాస్ పాలనలో విఫలమయ్యారని విమర్శించారు. అధికారులపై మేయర్‌కు ఎలాంటి నియంత్రణ లేదని ఆరోపించారు.

నగర సమస్యలపై సోమవారం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి, అనంతరం ప్రజావాణిలో వినతిపత్రం సమర్పిస్తామని హరిశంకర్ తెలిపారు. నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో పాలకవర్గం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ–శ్రీనివాస్, షేక్ యూసుఫ్, మాజీ కార్పొరేటర్లు గందె మాధవి–మహేష్, నందేల్లి రమాదేవి, దిండిగాల మహేష్, కంసాల శ్రీనివాస్, ఎడ్ల అశోక్, బోనాల శ్రీకాంత్, నాంపల్లి శ్రీనివాస్, నక్క కృష్ణ, జక్కని ఉమాపతి, నాయకులు గడ్డం ప్రశాంత్ రెడ్డి, సుంకిశాల సంపత్ రావు, నేతి రవివర్మ, గంగాధర చందు, పటేల్ సుధీర్ రెడ్డి, నారదాసు వసంతరావు, అరే రవి, తొంటి రాజేందర్, ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి, నయీమ్, చేతి చంద్రశేఖర్, మంతిని కిరణ్, పిట్టల శ్రీనివాస్, మిడిదొడ్డి నవీన్, చొక్కారపు చంద్రం, మేచినేని పవన్, మహిళా నాయకురాళ్లు కంజర్ల రేణుక, గంటల రేణుకతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News