వెయ్యి రోజుల దగా పాలనపై బీఆర్‌ఎస్‌ పోరుబాట.

ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ కరీంనగర్‌లో భారీ ఆటోల ర్యాలీ.

వెయ్యి రోజుల దగా పాలనపై బీఆర్‌ఎస్‌ పోరుబాట.

కరీంనగర్, సెప్టెంబర్ 6(తెలంగాణ ముచ్చట్లు ):

 కాంగ్రెస్‌ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీల అమలులో తీవ్ర వైఫల్యం చెందిందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ చేపట్టిన పోరుబాట కార్యక్రమం ఐదో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా కరీంనగర్‌లో ఆటో కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు.

నగరంలో తాగునీరు, వీధి దీపాలు, శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారంతో పాటు బస్తీ దవాఖానాల ఏర్పాటు, ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ ఆటోలతో నగరంలో ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొని ఆటో కార్మికులకు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ బీఆIMG-20260906-WA0007ర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News