సాగునీరు, బీటీ రోడ్డు కోసం ఎమ్మెల్యేను కలిసిన రైతులు .

సాగునీరు, బీటీ రోడ్డు కోసం ఎమ్మెల్యేను కలిసిన రైతులు .

మాజీ జెడ్పీటీసీ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మేఘారెడ్డిని కలిసిన రైతులు

పెద్దమందడి,సెప్టెంబర్06(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం బలిజపల్లి, జంగమాయపల్లి గ్రామాలకు చెందిన రైతులు తమ సాగునీరు, రహదారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిని కలిసి వినతిచేశారు. వనపర్తి జిల్లా డీసీసీ అధికార ప్రతినిధి, మాజీ జెడ్పీటీసీ కే. రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో రైతులు ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను వివరించారు.కర్నె తండా లిఫ్ట్‌ ద్వారా బసిరెడ్డి చెరువును నీటితో నింపి, చెరువు నుంచి రైట్‌ కెనాల్‌ కాల్వ ద్వారా ఎగువ ప్రాంతాల్లోని ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని రైతులు కోరారు. దీనిపై ఎమ్మెల్యే మేఘారెడ్డి సానుకూలంగా స్పందించి, సంబంధిత అటవీ శాఖ అధికారులతో మాట్లాడి త్వరలోనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాల్వ నిర్మాణానికి భూములు ఇచ్చే రైతులకు పది రోజుల్లో టోకెన్‌ అమౌంట్‌ అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.అదేవిధంగా ఎర్రగుంట తండా కట్ట నుంచి రుక్కనపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మించాలని రైతులు ఎమ్మెల్యేను కోరారు. ప్రస్తుతం ఉన్న మట్టి రోడ్డు వర్షాలకు కొట్టుకుపోవడంతో పాటు గుంతలమయంగా మారి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రహదారి నిర్మాణానికి సంబంధించిన ఎస్టిమేషన్‌ సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.రైతులు కోరిన సమస్యలపై సానుకూలంగా స్పందించి త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి మాజీ జెడ్పీటీసీ రమేష్ గౌడ్, రైతులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు పానుగంటి రాములు, బలిజపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, బలిజపల్లి, జంగమాయపల్లి గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News