తండ్రి జ్ఞాపకార్థంగా ఆంజనేయ స్వామి దేవాలయానికి ఇన్వర్టర్ బ్యాటరీ విరాళం.
పెద్దమందడి,సెప్టెంబర్06(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయానికి ఎక్సైజ్ ఎస్ఐ వై. శ్రీనివాసులు తన తండ్రి, కీర్తిశేషులు పెద్ద ఎల్లయ్య జ్ఞాపకార్థం ఇన్వర్టర్ బ్యాటరీని విరాళంగా అందజేశారు.తండ్రి జ్ఞాపకార్థంగా ఆంజనేయ స్వామి దేవాలయానికి ఉపయోగపడే వస్తువును అందించాలనే భక్తి భావంతో శ్రీనివాసులు ఇన్వర్టర్ బ్యాటరీని తన తరఫున దేవాలయానికి అందించారు. ఆలయ అవసరాలకు ఉపయోగపడే ఈ విరాళం పట్ల దేవాలయ అర్చకులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు శివకుమార్ స్వామి మాట్లాడుతూ.. తండ్రి జ్ఞాపకార్థం దేవాలయానికి సేవా రూపంలో విరాళం అందించడం అభినందనీయమని అన్నారు. భక్తి భావంతో చేపట్టే ఇటువంటి సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మికతతో పాటు సామాజిక బాధ్యతకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు.వై. శ్రీనివాసులు, వారి కుటుంబ సభ్యులకు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు, అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని అర్చకులు శివకుమార్ స్వామి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్ ,ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


Comments