గణేష్ మండపాలకు అనుమతులు తప్పనిసరి.
ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి
-- పెద్దమందడి ఎస్సై జలంధర్ రెడ్డి
పెద్దమందడి,సెప్టెంబర్6:( తెలంగాణ ముచ్చట్లు)
గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని వనపర్తి జిల్లా పెద్దమందడి ఎస్సై జలంధర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. మండపాల ఏర్పాటుకు ముందు సంబంధిత శాఖల నుంచి అనుమతులు పొందాలని తెలిపారు.గణేష్ మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై సూచించారు. విద్యుత్ కనెక్షన్లు, మండపాల నిర్మాణం, భద్రత తదితర అంశాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ఊరేగింపులు నిర్వహించే సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులకు సహకరించాలని కోరారు.డీజేలు, లౌడ్‌స్పీకర్ల వినియోగంలో ప్రభుత్వం విధించిన నిబంధనలు, నిర్ణీత సమయపాలన తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై జలంధర్ రెడ్డి హెచ్చరించారు.గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో ఎలాంటి వివాదాలకు తావులేకుండా ప్రశాంతంగా నిర్వహించాలని ఆయన కోరారు. ప్రజలు, ఉత్సవాల నిర్వాహకులు పోలీసులకు సహకరించి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.


Comments