15వ బెటాలియన్‌లో ఘనంగా బంజారా తీజ్ ముగింపు వేడుకలు.

సంప్రదాయాలు, సంస్కృతికి అద్దం పట్టిన వేడుకలు..

15వ బెటాలియన్‌లో ఘనంగా బంజారా తీజ్ ముగింపు వేడుకలు.

సత్తుపల్లి, సెప్టెంబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు):

బంజారా సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే తీజ్ పండుగ ముగింపు వేడుకలు బి. గంగారం గ్రామంలోని 15వ బెటాలియన్ క్యాంపస్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. బెటాలియన్ ప్రాంగణం తీజ్ పండుగ సందడితో కళకళలాడింది. బంజారా సంప్రదాయ దుస్తులు, సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ వేడుకలతో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. కార్యక్రమానికి 15వ బెటాలియన్ కమాండెంట్ ఎన్. పెద్ద బాబు ముఖ్యఅతిథిగా హాజరై వేడుకల్లో పాల్గొన్నారు. బెటాలియన్ అధికారులు, సిబ్బంది, బంజారా సమాజ పెద్దలు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తీజ్ పండుగ సందర్భంగా బంజారా సంస్కృతిలోని ప్రత్యేకతలను ప్రతిబింబించేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సంప్రదాయ ఆచారాలు, పాటలు, నృత్యాలు, ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కుటుంబ సభ్యులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొనడంతో కార్యక్రమం ఆద్యంతం సందడిగా సాగింది. బంజారా సమాజానికి తీజ్ పండుగకు ఉన్న ప్రత్యేకతను ఈ సందర్భంగా పలువురు గుర్తుచేసుకున్నారు. తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయాలను కాపాడుకుంటూ వాటి విశిష్టతను భావితరాలకు అందించాల్సిన అవసరాన్ని చాటిచెప్పారు. ఈ సందర్భంగా కమాండెంట్ ఎన్. పెద్ద బాబు మాట్లాడుతూ బంజారా సమాజానికి తీజ్ పండుగ ఎంతో విశిష్టమైనదన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు ఒక సమాజానికి ప్రత్యేక గుర్తింపునిస్తాయని, వాటిని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. తీజ్ వంటి పండుగలు కుటుంబ సభ్యులను, సమాజాన్ని ఒక్కతాటిపైకి తీసుకురావడంతో పాటు ఐక్యతా భావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. వేడుకలను సమన్వయంతో నిర్వహించి విజయవంతం చేసిన నిర్వాహక కమిటీ సభ్యులు, బెటాలియన్ అధికారులు, సిబ్బందిని కమాండెంట్ అభినందించారు. బంజారా సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ఇటువంటి కార్యక్రమాలు మరింతగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.IMG-20260906-WA0017ఆనందోత్సాహాలు, సంప్రదాయ కళారూపాలు, కుటుంబ సభ్యుల సందడితో బి. గంగారం గ్రామంలోని 15వ బెటాలియన్ క్యాంపస్‌లో నిర్వహించిన తీజ్ ముగింపు వేడుకలు ఘనంగా ముగిశాయి.

Tags:

Post Your Comments

Comments

Latest News